క్రైమ్టాప్ స్టోరీస్తెలంగాణ
Trending

కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ వేటు

వివాదాస్పద వ్యాఖ్యలతో ఉద్రిక్తతలకు కారణమవుతున్న విశ్లేషకుడు కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ వేటు వేశారు పోలీసులు. ఆరు నెలల వరకూ మళ్లీ హైదరాబాద్‌లో అడుగు పెట్టవద్దంటూ హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా నగరంలోకి వస్తే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించారు.  ఇటీవల ఓ టీవీ ఛానల్‌లో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కత్తి మహేశ్‌. దీనిపై హిందూ మత సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీపీఠం పీఠాధిపతి స్వామీ పరిపూర్ణానంద దీన్ని నిరసిస్తూ, ధర్మాగ్రహయాత్రను సంకల్పించారు.

కత్తి మహేశ్‌ ఇలానే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంతో, ఆయన కారణంగా నగరంలో పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇవాళ ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించారు. కత్తి మహేశ్‌ను సొంత జిల్లా చిత్తూరుకు తరలించారు.

హైదరాబాద్‌లోకి తమ అనుమతి లేకుండా అడుగుపెట్టకూడదంటూ ఆదేశించారు పోలీసులు. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు పోలీసులు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close