సినిమా

పవన్ సరసన నిత్యామీనన్ ఖరారు .. పోస్టర్ రిలీజ్!

  • నిత్యామీనన్ కి మంచి క్రేజ్
  • పవన్ సరసన ఛాన్స్
  • ఈ రోజే షూటింగులో చేరిక 
  • సంక్రాంతికి భారీ రిలీజ్

పవన్ కల్యాణ్.. రానా ప్రధాన పాత్రధారులుగా ఒక సినిమా రూపొందుతోంది. సాగర్ కె.చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకి ఇది రీమేక్. అక్కడ వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

అలాంటి ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ .. రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. పవన్ సరసన నిత్యామీనన్ ఖాయమైపోయింది. ఈ రోజున ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆమెకి వెల్ కమ్ చెబుతూ, ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి పవన్ –  నిత్యామీనన్ కాంబినేషన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. త్వరలోనే ఐశ్వర్య రాజేశ్ కూడా షూటింగులో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close