సినిమా

నితిన్ పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తి ఈమెనేన‌ట‌..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నితిన్ పెళ్లికి సంబంధించిన చ‌ర్చ గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. షాలిని అనే అమ్మాయిన‌ని నితిన్ వివాహం చేసుకోనున్నాడ‌ని, ఏప్రిల్‌లో వీరి వివాహం ఉంటుంద‌ని కొన్నాళ్ళుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా షాలినికి సంబంధించిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. నితిన్ పెళ్ళాడే అమ్మాయి ఈమే అంటూ నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. నితిన్ క్లారిటీ ఇస్తేనే త‌ప్ప ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది క్లారిటీ రాదు.  ఇక రేపు హైదరాబాద్‌లోని  నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించారట.  ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫిబ్ర‌వ‌రి 21న నితిన్ భీష్మ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close