క్రైమ్

జూబ్లీహిల్స్‌ రేవ్‌పార్టీలో కొత్త ట్విస్ట్‌

జూబ్లీహిల్స్‌ రోడ్‌  నెం.10లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీ ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పబ్‌ను బుక్‌ చేసుకుంది ఓ ఫార్మా కంపెనీగా పోలీసులు గుర్తించారు. సేల్స్‌ను పెంచుకునేందుకే ఆ పార్మా కంపెనీ రేవ్‌ పార్టీని ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది.  జూబ్లీహిల్స్‌లోని సీక్రెట్‌ ఎఫైర్‌ పబ్‌లో కొంతమంది యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్‌ పోలీసులు టాప్‌ పబ్‌పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 23మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డాక్టర్లు, సేల్స్‌ ఉద్యోగుల కోసం  ప్రతి ఏటా ఇలాంటి రేవ్‌ పార్టీని ఈవెంట్‌ ఆర్గనైజన్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పట్టుబడ్డ యువతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వారిగా గుర్తించారు. సినిమా అవకాశాలు, ఈవెంట్‌ డాన్సుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన యువతులను వ్యభిచార రొంపిలోకి దించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రసాద్‌ పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close