టాప్ స్టోరీస్స్పెషల్

‘పర్సెవరెన్స్’ అంగారకుడిపై కాలుమోపినప్పటి వీడియోను విడుదల చేసిన నాసా.. ఆనందంతో ఎగిరి గంతేసిన శాస్త్రవేత్తలు

  • శుక్రవారం గ్రహంపై ల్యాండ్ అయిన ‘పర్సెవరెన్స్’ 
  • ఆవిష్కృతమైన అద్భుత క్షణాలు
  • ల్యాండింగ్‌ను చిత్రీకరించేందుకు 7 కెమెరాలు ఆన్
  • ల్యాండింగ్ సమయంలో లేచిన దుమ్ము

అరుణగ్రహంపై జీవం ఉనికిపై ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ‘పర్సెవరెన్స్’ రోవర్ ఇటీవల అంగారకగ్రహంపై విజయవంతంగా అడుగుపెట్టింది. గ్రహంపై రోవర్ అడుగిడుతున్న అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను తాజాగా నాసా విడుల చేసింది.

రోవర్ ల్యాండ్ కావడానికి ముందు పారాచూట్ విచ్చుకోవడంతో పాటు, అది కిందకి దిగుతున్న సమయంలో మార్స్ ఉపరితలం కూడా వీడియోలో కనిపించింది. గ్రహానికి అది దగ్గరవుతున్న కొద్దీ ఉపరితలం స్పష్టంగా కనిపించింది. అరుణగ్రహం పేరును సార్థకం చేసేలా అక్కడి నేలంతా ఎర్రగా ఉంది. రోవర్ నేలపైకి దిగుతున్న సమయంలో అరుణగ్రహంపై దుమ్ము లేచింది. అది సురక్షితంగా ల్యాండ్ అయిన మరుక్షణం శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు.

శుక్రవారం ఈ రోవర్ అరుణగ్రహంపై ల్యాండ్ అయింది. ఇందులో రెండు మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయి. ల్యాండింగ్‌ను రికార్డు చేసేందుకు 7 కెమెరాలను శాస్త్రవేత్తలు ఆన్ చేశారు. మున్ముందు మరిన్ని వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తామని చెప్పారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close