ఆంధ్రరాజకీయం

రాష్ట్రంలో దున్నపోతు ప్రభుత్వం

  • అమరావతి ఆందోళనకారులపై అక్రమ కేసులు
  • ఆయన జైల్లో ఉన్నట్లు అందరినీ పంపాలనుకుంటున్న జగన్‌: లోకేశ్‌
  • గుంటూరు సబ్‌ జైల్లో రైతులకు పరామర్శ

‘‘రాష్ట్రానికి తుగ్లక్‌ సీఎం వచ్చి 3 రాజధానులు అంటున్నారు. మూడు ముక్కల రాజధాని వద్దు, అమరావతిలోనే కావాలని ఆందోళ న చేస్తున్న రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, మహిళలపై తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి నెట్టి వేధిస్తున్నారు. దీనికి వైసీపీ ప్రభుత్వం వడ్డీతో సహా మూల్యం చెల్లించ క తప్పదు. జైల్లో ఉన్న రాజధాని ప్రాంత రైతులకు మేం న్యాయ సహాయం అంది స్తాం. వారు అధైర్యపడాల్సిన పనిలేదు. కేసులు, అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరు’’ అని టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేశ్‌ అన్నారు. బాపట్లలో జే ఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన హాజరయ్యా రు. అనంతరం ఆయన బాపట్లలో జోలెపట్టి విరాళాలు సేకరించారు. అలాగే గుం టూరు సబ్‌ జైలులో ఉన్న 21 మంది రైతులను పలువురు టీడీపీ, సీపీఐ, బీఎస్పీ, జనసేన నేతలతో కలసి పరామర్శించారు. ఆయా సందర్భాలలో లోకేశ్‌ మాట్లాడా రు. రాష్ట్రంలో దున్నపోతు ప్రభుత్వం ఉందనీ, రివర్స్‌లో నడుస్తోందని విమర్శించా రు. వెనుకబడిన సౌతాఫ్రికాను ఆదర్శంగా తీసుకొని, పరిపాలన వికేంద్రీకరణ పే రుతో పచ్చగా ఉన్న అమరావతిని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై పోలీసులు విచక్షణా రహితంగా దాడులు చేస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలు బీచ్‌ ఫెస్టివల్‌లో డ్యాన్సులు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా. గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ పాలనలో పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. ఉద్యమంతో ఏ మాత్రం సంబంధంలేని వారిని కూడా అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్న తీరును ఆయన ఉదాహరణలతో వివరించారు. 16 నెలల పాటు జైలులో ఉ న్న జగన్‌కు రాష్ట్రంలోని అత్యధికులను జైలుకు పంపించాలని కలగంటున్నారని ఆ రోపించారు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులను ఆయా ప్రాంతాల్లో తిరగకుండా పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. టీడీపీ కార్యాలయం చు ట్టూ 500 మంది పోలీసులు ఉన్నారని, వారు చేయాల్సింది అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌ దేశం విడిచిపోకుండా కాపలా కాయడమంటూ ఎద్దేవా చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ గాల్లా జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close