క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్
ముంబైలోని రద్దీ నివాసాల మధ్య కుప్పకూలిన విమానం

ముంబై ఘట్కోపర్లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చార్టెడ్ విమానం కుప్పకూలింది. మరికొద్దిసేపట్లో ల్యాండ్ కావల్సి ఉండగా ఆ విమానం నియంత్రణ తప్పి, ముంబైలోని రద్దీ ఉండే నివాసాల మధ్యే కూలి, మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం అక్కడికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం విమానానికి రిపేర్లు చేశారని, టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా కుప్పకూలిందని అధికారులు తెలిపారు. 2014లో యూపీ ప్రభుత్వం నుంచి ఛార్టెడ్ ఫ్లైట్ ను యూవై సంస్థ కొనుగోలు చేసింది.