క్రైమ్టాప్ స్టోరీస్తెలంగాణబ్రేకింగ్ న్యూస్రాజకీయం

ఎంపీ బాల్కసుమన్‌ ఫొటోలు మార్ఫింగ్‌.. ఇద్దరు అరెస్ట్‌

టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌పై సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాల్క సుమన్‌ భార్య ఫొటోను మార్పింగ్‌ చేసి సంధ్య అనే మహిళ ఫొటోను చేర్చి ప్రచారం చేశారు. ఇప్పుడు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంపీ బాల్కసుమన్‌పై అసత్య  ప్రచారం జరుగుతుందని మంచిర్యాల సీఐ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నవి మార్ఫింగ్‌ చేసిన ఫొటోలని స్పష్టం చేశారు. బాధితులుగా చెప్పుకుంటున్న బోయిని సంధ్య, విజేతలపై 2018 ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశామన్నారు. ఎంపీ సుమన్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసి లబ్ది పొందాలనే ఎంపీ కుటుంబ సభ్యల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ప్రచారం చేశారని సీఐ పేర్కొన్నారు. గతంలోనే సంధ్య, విజేతలు పలువురిని బ్లాక్‌ మెయిల్‌ చేసి వేధించినట్లు విచారణలో తేలిందని, వీరిద్దరిపై బంజారాహిల్స్‌ పీఎస్‌లోనూ కేసులు నమోదైనట్లు సీఐ మహేష్‌ తెలిపారు.

రాజకీయంగా రాణిస్తున్న ఎంపీ సుమన్‌కు సీఎం కేసీఆర్‌తో మంచి సత్సంబంధాలున్నాయనే చెప్పొచ్చు. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లినా బాల్కసుమన్‌ ను కూడా తీసుకెళ్తుంటారు. పలు సభలు, సమావేశాల్లో ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు సందిస్తుంటారు బాల్క సుమన్‌. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బాల్కసుమన్‌పై ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతుందంటున్నారు. బాల్కసుమన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close