టాప్ స్టోరీస్తెలంగాణరాజకీయం

జనసేన లోకి మోత్కుపల్లి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మోత్కుపల్లి నర్సింహులు మరో పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌లో ఆయన చేరవచ్చంటూ ప్రచారం సాగినా, చివరకు జనసేనను ఎంచుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమై, తన చేరికను ప్రకటించనున్నారు మోత్కుపల్లి.

దళిత వర్గానికి చెందిన బలమైన నేతగా గుర్తింపు పొందిన మోత్కుపల్లి ఎన్టీఆర్ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన ఆయన, ఎన్టీఆర్ మరణం వరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. చివరకు చంద్రబాబు ఆహ్వానంతో తిరిగి టీడీపీలోకి వచ్చారు. ఆలేరు నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన మోత్కుపల్లి, పార్టీలో రేవంత్‌రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంపై తరచూ బహిరంగంగానే విమర్శలు చేసేవారు. చివరకు ఆయనకు గవర్నర్ పదవి వస్తుందంటూ ప్రచారమూ సాగింది. కానీ ఆ పదవి దక్కకపోయే సరికి తీవ్ర నిరాశ చెందారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిందని, దాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ ఎన్టీఆర్ వర్ధంతి నాడు సంచలన ప్రకటన చేసి కలకలం రేపారు మోత్కుపల్లి. దీంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు.

జనసేనకు లాభమా నష్టమా..?

తెలంగాణలోని బలమైన నేతల్లో మోత్కుపల్లి కూడా ఒకరన్న వాదనలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆయన నోరు ఎక్కువగా పారేసుకుంటారన్న విమర్శలున్నాయి. అలాగే అందర్నీ కలుపుకునే వెళ్లే విషయంలోనూ ఇబ్బందులున్నాయి. పార్టీలో ఏదైనా తేడా జరిగితే అందరిముందా ఆయనే పరువు తీసేసే ప్రమాదం ఉంది. జనసేనలో ప్రస్తుతానికి పవన్ చెప్పిందే వేదం. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మోత్కుపల్లి ఆయన కింద ఎంతవరకూ పనిచేయగలరన్న అనుమానాలున్నాయి. అలాగే, మోత్కుపల్లికి ఎంతవరకూ పవన్ స్వేచ్ఛ ఇస్తారన్నదీ తేలాల్సి ఉంది. ఒకవేళ మోత్కుపల్లికి పవన్ స్వేచ్ఛ ఇవ్వగలిగితే తెలంగాణలో జనసేన బలపడేందుకు అవకాశం ఉంటుందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close