సినిమా

దసరా పండక్కి ‘బ్యాచ్ లర్’ .. అధికారిక ప్రకటన!

  • ‘బ్యాచ్ లర్’కి ముహూర్తం ఖరారు
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల
  • తాజాగా అధికారిక పోస్టర్ రిలీజ్
  • దసరాకి పెరుగుతున్న పోటీ  

అఖిల్ .. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాంబినేషన్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ రూపొంది కొంతకాలమవుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇక దసరా రోజుల్లో మాత్రం ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.

తాజా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇక నుంచి ఈ సినిమా ప్రమోషన్లు జోరందుకుంటాయని చెప్పుకొచ్చారు.

పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నిర్మితమైంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close