జాతీయంటాప్ స్టోరీస్

మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వు.. పాకిస్థాన్‌కు అమిత్ షా వార్నింగ్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌న్నారు. దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌బోమ‌ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స్ట్రైక్స్ త‌ప్ప‌వు అని అమిత్ షా హెచ్చ‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌. ఇండియా స‌రిహ‌ద్దుల‌ను ఎవ‌రూ చెరిపే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌ద‌న్న గ‌ట్టి సందేశం దీని ద్వారా వెళ్లింది. ఒక‌ప్పుడు చ‌ర్చ‌లు జ‌రిగేవి. కానీ ఇప్పుడు దెబ్బ‌కు దెబ్బ కొట్టే స‌మ‌యం అని అమిత్ షా అన్నారు. గోవాలో నేష‌న‌ల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివ‌ర్సిటీకి శంకుస్థాప‌న చేయ‌డానికి వెళ్లిన అమిత్ షా ఈ కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close