స్పెషల్

వృద్ధి 5 శాతమే

  • వచ్చే ఏడాది 5.8 శాతానికి పెరిగే అవకాశం
  • ప్రపంచ బ్యాంకు అంచనా

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జనవరి 9: గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో 6 శాతంగా ఉన్న భారత వృద్ధిరేటు ఈ ఏడాది 5 శాతానికి దిగజారుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే ఆ తర్వాత ఇది కొంతమేరకు పుంజుకొని 2020-21 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరుకొనే అవకాశాలున్నాయని పేర్కొన్నది. బ్యాం కింగేతర ఆర్థిక సంస్థల్లో రుణాల మం జూరుకు ఉన్న కఠినమైన నిబంధనలు, వినియోగంలో తగ్గుదలతోపాటు ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తతలు భారత వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. వ్యాపార వాతావరణాన్ని, న్యాయపాలనను, రుణాల నిర్వహణను, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు చేపట్టే చర్యలు స్థిరమైన వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది. పెట్టుబడులతోపాటు, వాణిజ్య రంగం క్రమంగా పుంజుకొంటున్నందున 2020లో ప్రపంచ వృద్ధిరేటు 2.5 శాతం మేరకు పెరుగుతుందని వెల్లడించింది. అభివృద్ధిచెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలతోపాటు వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు మందకొడిగా కొనసాగన్నందున విస్తృత వృద్ధికి ఊతమిచ్చే సంస్థాగత సంస్కరణలు తీసుకొచ్చేందుకు గల అవకాశాలను విధాననిర్ణేతలు అందిపుచ్చుకోవాలని, పేదరికాన్ని తగ్గించేందుకు ఇది ఎంతో ముఖ్యమని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది.

కార్మిక ఉత్పాదకత వృద్ధిరేటు 6.3 శాతానికి చేరితేనే..

దేశ ఆర్థిక వృద్ధిరేటు 8 శాతానికి చేరుకోవాలంటే కార్మిక ఉత్పాదకత వృద్ధిరేటును 6.3 శాతానికి పెంచుకోవాలని ‘ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌’ సం స్థ గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో దేశ కార్మిక ఉత్పాదకత వృద్ధిరేటు 5.2 శాతంగా ఉన్నట్టు తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటును 9 శాతానికి పెంచుకోవాలంటే కార్మిక ఉత్పాదకత వృద్ధిరేటును 7.3 శాతానికి పెంచుకోవాలని, 2019 ఆర్థిక సంవత్సరంలో కార్మిక ఉత్పాతదక వృద్ధిరేటు స్థాయి కంటే ఇది 40.4 శాతం అధికమని పేర్కొన్నది. ప్రస్తుతం దేశంలో వృద్ధిరేటు మందగించినందున సమీప భవిష్యత్తులో కార్మిక ఉత్పాదకత వృద్ధిరేటు పెరిగే అవకాశాలు కనిపించడంలేదని తెలిపింది. అయినప్పటికీ ఇది సాధించలేని లక్ష్యమేమీ కాదని, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల భారత్‌ లాంటి కొన్ని దేశలు ఒత్తిడిలో కూరుకుపోయినప్పటికీ గతంలోనూ ఇలాంటి లక్ష్యాలను సాధించామని ‘ఇండియా రేటింగ్స్‌’ గుర్తుచేసింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close