ఆంధ్రసినిమాస్పెషల్

మిస్‌ ఇండియా టైటిల్‌ మిస్‌ అయిన ఆంధ్రా అమ్మాయి

హాట్‌హాట్‌గా సాగిన ఫెమినా మిస్ ఇండియా 2018  అందాల పోటీల్లో కిరీటాన్ని తమిళనాడు అమ్మాయి అనుక్రీతి వాస్‌ తన్నుకుపోయింది. చివరి వరకూ పోటీలో ఉన్న ఆంధ్రా అమ్మాయి శ్రేయ రావు కామవరపు మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

 ముంబైలో జరిగిన ఈ ఫైనల్‌ పోటీలను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్ చేశారు. టైటిల్ గెలుచుకున్న అనుక్రీతి వయస్సు 19 సంవత్సరాలు. చెన్నైలో ప్రస్తుతం ఆమె బీ.ఏ. ఫ్రెంచ్‌ కోర్స్ చేస్తున్నారు. టైటిల్ గెలుచుకున్న ఆమెకు గత ఏడాది విజేత, మిస్‌ వరల్డ్ 2017 మానుషి చిల్లర్‌ కిరీటాన్ని తొడిగారు. ఫస్ట్ రన్నరప్‌గా హర్యానా ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఎంపికయ్యింది. మీనాక్షి వయస్సు 21 సంవత్సరాలు.

 సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రా అమ్మాయి శ్రేయ రావు హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. చిరక్ స్కూల్‌లో చదువుకున్న ఆమె, వాసవి ఆర్కిటెక్ట్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ సంస్థలో ఆర్కిటెక్ట్‌ గా పనిచేస్తున్నారు శ్రేయారావు.

 

చిరునవ్వుతో కళగా కనిపించే 23 ఏళ్ల శ్రేయ ఫెమినా మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికై ఫైనల్‌ పోటీలకు చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఆమె టైటిల్ సాధిస్తుందని అందరూ ఆశించారు. అయితే.. ఫైనల్‌ రేసులో మాత్రం తమిళ అమ్మాయి దూసుకెళ్లి కిరీటాన్ని కొట్టేసింది. మూడో స్థానంలో నిలబడడంతో భారతదేశం తరపున శ్రేయ మిస్‌ కాంటినెంటల్‌ పోటీలకు వెళ్లనున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close