జాతీయంటాప్ స్టోరీస్టెక్నాలజీ

దేశ రక్షణ కోసం ఢిల్లీకి మిసైల్ షీల్డ్

రక్షణ వ్యవస్థలో భాగంగా అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను కలిగి ఉండటమే కాదు.. ప్రత్యర్థులు విసిరే వాటి నుంచి కూడా తప్పించుకునే వ్యవస్థ మన దగ్గర ఉండాలి. దీనిని దృష్టిలో ఉంచుకొనే దేశ రాజధాని ఢిల్లీకి మిసైల్ షీల్డ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

శత్రు దేశాల ప్రయోగించే క్షిపణుల నుంచి ఢిల్లీ నగరాన్ని రక్షించుకునే అత్యాధునికి రక్షణ వ్యవస్థ ఇది. 1980లలో తొలిసారి అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఈ మిసైల్ షీల్డ్ కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. రష్యా దాడుల నుంచి తప్పించుకోవడానికి వాషింగ్టన్‌కు ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓ కుటుంబానికి ఇల్లు వర్షం నుంచి ఎలా రక్షణ ఇస్తుందో.. అలాగే నగరాన్ని మిసైల్ దాడుల నుంచి ఈ రక్షణ వ్యవస్థ అలాగే కాపాడుతుంది. ఆ తర్వాతి కాలంలో దేశాల రక్షణ వ్యవస్థల్లో మిసైల్ షీల్డ్ కీలకంగా మారింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close