రాజకీయం

ల‌క్ష ఇండ్లు చూడ‌కుండానే పారిపోయారు -మ‌ంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : ల‌క్ష ఇండ్ల స‌వాల్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ల‌క్ష ఇండ్లు చూపించాల‌న్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క స‌వాల్‌ను స్వీక‌రించిన మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్‌.. ఆ నిర్మాణాల‌ను చూపించేందుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా నిన్న కొన్ని ఇండ్ల‌ను భ‌ట్టికి చూపించారు. ఇవాళ తుక్కుగూడ‌, రాంప‌ల్లిలో నిర్మిస్తున్న ఇండ్ల‌ను భ‌ట్టి విక్ర‌మార్క‌కు మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ క‌లిసి చూపించారు. కానీ భ‌ట్టి మాత్రం త‌న ప‌ర్య‌ట‌న‌ను అర్ధాంత‌రంగా ముగించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ..  జీహెచ్ఎంసీలో స్థ‌లం లేనందునే న‌గ‌ర శివారుల్లో డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామ‌ని స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఇండ్లు క‌ట్ట‌లేద‌ని భ‌ట్టి అన‌డం స‌రికాదు. ఒక వేళ ఆయ‌న జీహెచ్ఎంసీలో స్థ‌లం చూపిస్తే అక్క‌డ త‌ప్ప‌కుండా ఇండ్ల నిర్మాణం చేప‌డుతామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. శివారుల్లో నిర్మిస్తున్న గృహాల్లో 90 శాతం ఇండ్లు న‌గ‌ర వాసుల‌కే అని తెలిపారు.ఇండ్లు ఎక్క‌డ నిర్మించినా అవి హైద‌రాబాద్ వాసుల‌కే ఇస్తామ‌న్నారు. ల‌క్ష ఇండ్ల‌కు సంబంధించిన జాబితా ఇస్తామంటే కాంగ్రెస్ నేత‌లు పారిపోయారు అని మంత్రి త‌ల‌సాని పేర్కొన్నారు. 

న‌గ‌రంలో భూములు లేక‌నే శివారు ప్రాంతాల్లో నిర్మించామ‌ని మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు. న‌గ‌రంలో ప్ర‌భుత్వ భూమి లేకుండా చేసింది కాంగ్రెస్ నేత‌లే అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close