తెలంగాణ

ఇంటింటికి తిరిగి చీరెలు పంచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్ : బతుకమ్మ చీరెల పంపిణీ ద్వారా సీఎం కేసీఆర్ మహిళలకు పెద్దన్నలా నిలిచారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏనుగొండలో ఇంటింటికి తిరిగి బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్ కొరమోని వనజ వెంకటయ్య, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ కమిషనర్ సురేందర్ పాల్గొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close