తెలంగాణ

దాశరథికి మంత్రి సత్యవతి నివాళి

హైదరాబాద్: తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి (Dasharthi) కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ నివాళులర్పించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ప్రకటించి.. ఉద్యమ చైతన్యం రగిలించిన గొప్పకవి దాశరథి అని అన్నారు. దాశరథి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కావడం తనకెంతో గర్వంగా ఉందన్నారు.

ఆయన సాహిత్య రంగంలో చేసిన సేవలు, ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి తెలంగాణలో ఉద్యమ చైతన్యం రగిల్చిన కవిగా గుర్తించిన ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. దాశరథి పేరుతో అవార్డును అందించడం ఆయన పట్ల సీఎం కేసీఆర్‌కున్న గౌరవానికి నిదర్శనమన్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close