తెలంగాణ

మోజెర్ల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి : జిల్లాలోని పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామ సమీపంలోని మోజెర్ల ఎత్తిపోతల పథకానికి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.
మోజర్ల వద్ద రూ.1.75 కోట్లతో అరబిందో ఫార్మా (రూ.1.5 కోట్లు) , రాంకీ సంస్థ (రూ.25 లక్షలు) సహకారంతో నిర్మించనున్న మోజర్ల- శారగట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంతో రైతులకు సాగనీటి కష్టాలు తీరనున్నాయి. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close