తెలంగాణరాజకీయం

రాష్ర్టాలకు కేంద్రం సహకరించడం లేదు -కేటీఆర్‌

 ముంబయిలో నిర్వహించిన నాస్కామ్‌ టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఫోరమ్‌ 28వ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మోడల్‌ అభివృద్ధి దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సహకారం చాలా తక్కువగా ఉందన్నారు. మేకిన్‌ ఇండియా అంటున్న కేంద్రం.. రాష్ర్టాలకు సహకరించడం లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబందు పథకాన్ని ఇతర రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. రైతుబంధుతో తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చామని ఆయన తెలిపారు. ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఐటీ పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరించామని చెప్పారు. టెక్‌ మహీంద్ర లాంటి ప్రముఖ కంపెనీలు వరంగల్‌లో తమ శాఖలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫార్మాక్లస్టర్‌ 19 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా టైక్స్‌టైల్స్‌ పార్క్‌ దేశంలోనే పెద్దది అని తెలిపారు. అమెరికా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నాయన్నారు. ఆ దేశాలతో పోలిస్తే తెలంగాణ జీడీపీ చాలా మెరుగ్గా ఉందన్నారు. ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ వాటా కేవలం 2 శాతం మాత్రమే మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close