తెలంగాణ

వట్టిపోయిన చెరువులకు కొత్త రూపం

జగిత్యాల : దశాబ్దాలుగా వట్టి పోయిన చెరువులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. మండుటెండల్లో సైతం చెరువుల మత్తడి దుంకుతున్నాయి. పిల్లలు చేపల్లా ఈదులాడుతూ సంబురాల్లో తేలిపోతున్నారని ఇదంతా సీఎం కేసీఆర్ కృషి ఫలితమేనని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని బుగ్గారం మండలంలో మద్దునూర్ గ్రామంలోఎస్సారెస్పీ కాలువలో పూడిక తీత పనుల్లో మంత్రి పాల్గొన్నారు. కూలీలతో కలిసి మట్టిని,  చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీళ్ల కోసం రైతులు మొగులు వైపు చూడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా మారి గోదావరి జలాలను ఒడిసి పట్టి నీటి గోసకు తావులేకుండా చేశారన్నారు.

చెరువుల్లో బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో తెలంగాణ మాగాణంలో రైతన్నలు పసిడి సిరులు పండిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా పంట మార్పిడి పై రైతులు దృష్టి సారించాలన్నారు. రైతుల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , జెట్పీటీసీ బాదినేని రాజేందర్, ఎంపీపీ రాజమణి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు


Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close