సినిమా

మూడేళ్ల తర్వాత మంచు మనోజ్‌ రీఎంట్రీ

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ మళ్లీ మేకప్‌ వేసుకునేందుకు సిద్దమయ్యాడు. దొంగ దొంగది మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచుమనోజ్‌ చివరి సారిగా 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు చిత్రంలో నటించాడు. ఈ సినిమా బాక్సాపీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో సినిమాలకు కొంత విరామం తీసుకున్నాడు. మూడేళ్ల విరామం తర్వాత ప్రేక్షకులను పలకరిస్తున్నట్లు మనోజ్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు. మనోజ్‌ ఎంఎం ఆర్ట్స్‌ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్‌లో అహం బ్రహ్మాస్మి చేస్తున్నాడు. మనోజ్‌ ఈ మూవీ టైటిల్‌ లుక్‌ను షేర్‌ చేశాడు. మూడేళ్ల తర్వాత మీ ముందుకొస్తున్నా. నా మొదటి సినిమా దొంగ దొంగది సమయంలో ఎలా ఫీలయ్యానో..ఇప్పుడు అదే భావోద్వేగంతో ఉన్నా. తెర వెనుక, తెరపై సాగుతున్న నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.  ఇన్నాళ్లుగా నా నట జీవితాన్ని మిస్సయ్యాను. సినీ అమ్మా..వచ్చేశానని మనోజ్‌ ట్వీట్‌ చేశాడు.  శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close