మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్

కరోనా వలన దాదాపు ఏడెనిమిది నెలలు ఇంటికే పరిమితం అయిన సెలబ్రిటీలు ఇప్పుడు కాస్త ఉపశమనం పొందేందుకు మాల్దీవులకు చెక్కేస్తున్నారు. ఇప్పటికే ప్రణీత, రకుల్, కాజల్, సమంత, నిహారిక, దిశా పటాని ఇలా పలువురు అందాల భామల తమ ఫ్యామిలీస్ తో భూతల స్వర్గమైన మాల్దీవులకి వెళ్ళారు. అక్కడి అందాలని తనివి తీరా ఆస్వాదిస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని థ్రిల్ చేశారు.
తాజాగా మంచు లక్ష్మీ ఫ్యామిలీ మాల్దీవులకి వెళ్ళారు. లక్ష్మీ ఆమె భర్త, పిల్లలతో పాటు మోహన్ బాబు కూడా మాల్దీవులలో అడుగుపెట్టారు. బీచ్‌ల్లో సముద్ర అందాలను ఆస్వాదిస్తూ ఈ ప్రాంతం భూతలస్వరంగా ఉందని.. ఆకాశం, నీరు, బీచ్‌లతో ఇక్కడి ప్రకృతి సోయగాలు ఎంతో బాగున్నాయని పేర్కొంది. ప్రస్తుతం మంచు లక్ష్మీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.