క్రైమ్

పది రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులపై అత్యాచారం.. కేకలు వేసిందన్న కోపంతో ఒకరి హత్య

  • గుజరాత్‌లో వెలుగులోకి దారుణ ఘటనలు
  • బాధిత చిన్నారులందరూ ఏడేళ్లలోపు వారే
  • సూరత్‌లో మరో ఘటన.. రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం

గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో జరిగిన ఓ దారుణం వెలుగులోకి వచ్చి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పది రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. కేకలు వేయడంతో మూడేళ్ల చిన్నారిని చంపేశాడు.

వన్సజదా గ్రామానికి చెందిన 26 ఏళ్ల విజయ్ ఠాకూర్ ఈ వికృత క్రీడకు పాల్పడ్డాడు. దినసరి కూలీ అయిన అతడికి భార్య, కుమార్తె కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్‌లో నీలి చిత్రాలు చూసే అలవాటున్న నిందితుడు విజయ్.. ఈ నెల 4న రంచర్దా గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాతి రోజు రాత్రి మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి యత్నించాడు. అయితే, ఆమె గట్టిగా కేకలు వేయడంతో చంపేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడి మృతదేహాన్ని ఓ కల్వర్టు సమీపంలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు. పది రోజుల క్రితం ఏడేళ్ల బాలికపైనా అతడు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో విజయ్ చెప్పాడు.

ఇలాంటి ఘటనే సూరత్‌లోనూ ఒకటి జరిగింది. గుడ్డూ యాదవ్ అనే వ్యక్తి బీహార్ వలస కూలీ కుటుంబానికి చెందిన రెండున్నరేళ్ల కుమార్తెను దీపావళి రోజున కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఆపై గొంతునులిమి చంపేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close