క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్

విహార యాత్రలో విషాదం, 35 మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సతారా జిల్లాలో విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేట్  బస్సు లోయలో పడడంతో  35 మంది మృతి చెందారు. అంబేనలి ఘాట్‌ పొలందపూర్ సమీపంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు విద్యార్థులు, కాలేజీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అదుపుతప్పి 500 అడుగుల లోయలో పడటంతో.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 33 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. వీరంతా మహాబలేశ్వర్‌ విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా కొంకణ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వారిగా గుర్తించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close