అంతర్జాతీయంటాప్ స్టోరీస్

యూరోప్ దేశాల్లో త‌గ్గిన‌ స‌గ‌టు జీవిత‌కాలం

బ్ర‌స్సెల్స్‌: యూరోప్ దేశాల్లో మ‌నిషి స‌గ‌టు జీవిత‌కాలం త‌గ్గింది. 27 దేశాలు ఉన్న యూరోపియ‌న్ యూనియ‌న్‌ను క‌రోనా వైర‌స్ తీవ్రంగా దెబ్బ‌తీసింది. దీంతో గ‌త ఏడాది(2020) కొన్ని దేశాల్లో స‌గ‌టు ఆయుష్షు ప‌డిపోయింది. ఈయూ స్టాటిస్‌టిక‌ల్ ఏజెన్సీ యూరోస్టాట్ బుధ‌వారం ఓ నివేదిక రిలీజ్ చేసింది. గ‌త ఏడాది ప్ర‌బ‌లిన కోవిడ్ వ‌ల్ల‌.. చాలా వ‌ర‌కు యూరోప్ దేశాల్లో స‌గ‌టు జీవిత‌కాల త‌గ్గిన‌ట్లు పేర్కొన్న‌ది. అత్య‌ధిక స్థాయిలో స్పెయిన్‌లో అది న‌మోదు అయిన‌ట్లు పేర్కొన్న‌ది. 2019తో పోలిస్తే స్పెయిన్‌లో స‌గ‌టు జీవిత‌కాలం 1.6 ఏళ్లు త‌గ్గిన‌ట్లు వెల్ల‌డించింది. బ‌ల్గేరియాలో ఆ న‌ష్టం 1.5 ఏళ్లుగా ఉన్న‌ది. ఆ త‌ర్వాత స్థానంలో లుథివేనియా, పోలాండ్‌, రొమేనియా దేశాలు ఉన్నాయి. ఈ మూడు దేశాల్లోనూ 1.4 ఏళ్ల స‌గ‌టు ఆయుష్షు త‌గ్గింది. కానీ డెన్మార్క్‌, ఫిన్‌ల్యాండ్ దేశాల్లో మాత్రం స‌గ‌టు జీవిత కాలం పెరిగింది. ఆ దేశాల్లో 0.1 ఏళ్ల ఆయుష్షు క‌లిసివ‌చ్చింది. బెల్జియంలో జీవిత కాలం 82.1 నుంచి 80.9, బ‌ల్గేరియాలో 75.1 నుంచి 73.6కు, స్పెయిన్‌లో 84 నుంచి 82.4కు, ఇట‌లీలో 83.6 నుంచి 82.4 ఏళ్ల‌కు ప‌డిపోయింది.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close