తెలంగాణబ్రేకింగ్ న్యూస్

ఎల్‌.బి.నగర్‌- అమీర్‌పేట మెట్రోను పరిగెత్తించాలన్న కేటీఆర్‌

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అత్యంత కీలకమైన అమీర్‌పేట-ఎల్‌.బి.నగర్‌ మార్గంలో టెస్ట్‌రన్ మొదలయ్యింది. ఈ మార్గంలో మెట్రో పరుగులు పూర్తి స్థాయిలో మొదలైతే, ఎల్‌.బి.నగర్‌ నుంచి అమీర్‌ వరకూ ట్రాఫిక్‌ సమస్యలు పూర్తిగా తొలిగిపోతాయి. స్టేషన్ల నిర్మాణం, పట్టాల అమరిక పూర్తి కావడంతో, ఈ మార్గంలో ప్రయోగాత్మకంగా మెట్రోను నడిపిస్తున్నారు ఎల్‌ అండ్ టి అధికారులు.

టెస్ట్‌ రన్ మొదలు కావడంతో ఎల్‌.బి.నగర్‌-అమీర్‌పేట మార్గాన్ని పరిశీలించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌. లక్డీకపూల్‌, నాంపల్లి, ఎంజీబీఎస్ స్టేషన్లలో పనులను ఆయన తనిఖీ చేశారు. జులై చివరికల్లా ఈ మార్గంలో మెట్రోను అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రో రైల్‌, ఎల్‌ అండ్ టి అధికారులను ఆదేశించారు.

 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close