సినిమా

ఎన్టీఆర్ కథపై కొరటాల కసరత్తులు!

  • ‘ఆచార్య’ సినిమాతో బిజీగా కొరటాల
  • తరువాత ప్రాజెక్టు ఎన్టీఆర్ తో
  • త్వరలోనే సెట్స్ పైకి

కొరటాల శివ సినిమాలను పరిశీలిస్తే, తెరపై తాను చెప్పదలచుకున్న కథ విషయంలో ఆయన ఎంత క్లారిటీగా ఉంటారో అర్థమవుతుంది. కథ పట్టుకుని సెట్స్ పైకి వచ్చిన తరువాత ఇక ఆయనలో తడబాటు ఉండదు. ఏ మోతాదులో  వినోదం ఉండాలో .. ఏ మోతాదులో సందేశం ఉండాలో ఆయనకి బాగా తెలుసు. అందువల్లనే ఇంతవరకూ ఆయన హిట్టు మాటనే విన్నారు. అలాంటి కొరటాల .. ‘ఆచార్య’ తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమాను చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథపైనే ఆయన కసరత్తు చేస్తున్నారట.

ఈ కథను కొరటాల ఇంతకుముందు రాసుకున్నదే. అయితే ఈ సినిమా కంటే ముందుగా ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అప్పటి నుంచి ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోవడమే కాకుండా, ఆయన పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోనున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కొరటాల తన స్క్రిప్ట్ పై మరింత కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికైతే కథానాయికగా కైరా అద్వాని పేరు వినిపిస్తోంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close