సినిమా

‘విక్రమ్’ టీమ్ సమక్షంలో కమల్ బర్త్ డే సెలబ్రేషన్స్!

  • ఈ నెల 7వ తేదీన కమల్ బర్త్ డే
  • సెట్స్ పై ఉన్న ‘విక్రమ్’ మూవీ
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న కమల్
  • దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్

కమలహాసన్ కథానాయకుడిగా ప్రస్తుతం ‘విక్రమ్’ సినిమా రూపొందుతోంది. కమల్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా కోసం కమల్ భారీ బడ్జెట్ ను కేటాయించడం విశేషం. ఈ సినిమా నుంచి వచ్చిన ఆయన ఫస్టులుక్ .. ఫస్టు వీడియో అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి.

ఈ సినిమాకి సంబంధించిన షూటింగు చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా టీమ్ కమల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను స్టార్ చేసింది. ఈ నెల 7వ తేదీన కమల్ బర్త్ డే. అయితే ఆ రోజున కమల్ మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉంటాడు గనుక, ముందుగానే ఈ సినిమా టీమ్ ఆయనతో కేక్ కట్ చేయించింది. యూనిట్ సభ్యులంతా కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఖైదీ’ .. ‘మాస్టర్’ సినిమాల తరువాత లోకేశ్ కనగరాజ్ అక్కడ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఆయన స్క్రీన్ ప్లే ప్రతిభను మెచ్చుకున్న కమల్ దీనికి అవకాశాన్ని ఇచ్చారు. విజయ్ సేతుపతి ..   ఫాహద్ ఫాజిల్ .. నరేన్ .. మేఘ ఆకాశ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close