అంతర్జాతీయంటాప్ స్టోరీస్

ట్రంప్‌పై కామెంట్ అడిగితే.. మూగ‌బోయిన కెన‌డా ప్ర‌ధాని

న‌ల్ల‌జాతీయుల అల్ల‌ర్ల‌తో అమెరికా అట్టుడుకుతున్న విష‌యం తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ మృతిని ఖండిస్తూ దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు హోరెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పొరుగు దేశ‌మైన కెన‌డాకు కూడా ఆ సెగ అంటుకున్న‌ది. కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఓ జ‌ర్న‌లిస్టు ఆయ‌న్ను ఇరుకున పెట్టే ప్ర‌శ్న వేశారు.  అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేప‌డుతున్న చ‌ర్య‌ల ప‌ట్ల మీరు నిర్లిప్తంగా ఉన్నార‌ని ట్రూడోను జ‌ర్న‌లిస్టు అడిగారు. నిర‌స‌న‌కారుల‌పై సైన్యాన్ని దింపుతున్న‌ట్లు ట్రంప్ హెచ్చ‌రించారు. దీనిపై మీ ఏమి కామెంట్ చేస్తార‌ని కెన‌డా ప్ర‌ధానిని ఓ రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించారు.  ఒక‌వేళ కామెంట్ ఇవ్వ‌లేక‌పోయినా.. ఎటువంటి సందేశం ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. 

ఆ స‌మ‌యంలో ట్రూడో తెగ ఇబ్బంది ప‌డ్డారు.  ఏమి కామెంట్ చేయాలో తెలియని ట్రూడో నోరు విప్ప‌లేక‌పోయారు. జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న‌కు బ‌దులు ఇచ్చేందుకు సుమారు 20 సెక‌న్ల పాటు ట్రూడో ఆలోచ‌న‌ల్లో ప‌డిపోయారు. చాలా దీర్ఘంగా ఆలోచించిన త‌ర్వాత కెన‌డా ప్ర‌ధాని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.  అమెరికా నిర‌స‌న‌ల‌పై స‌మాధానం ఇచ్చేందుకు ట్రూడో ఎందుకు ఇంతలా ఆలోచించారో చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఆయ‌న చివ‌ర‌కు ఓ స్ప‌ష్ట‌మైన‌ విష‌యాన్ని వెల్ల‌డించారు. 

అమెరికాలో జ‌రుగుతున్న ప‌రిణామాలు తీవ్ర దిగ్భ్రాంతిని క‌లిగిస్తున్న‌ట్లు ట్రూడో పేర్కొన్నారు. ప్ర‌జ‌లంద‌ర్నీ స‌మీక‌రించాల్సిన క్ష‌ణం ఇదేన‌న్నారు. ద‌శాబ్ధాల ప్ర‌గ‌తి సాధించినా.. అన్యాయం మాత్రం జ‌రుగుతూనే ఉంద‌న్నారు. త‌మ‌కు కూడా ఇలాంటి స‌వాళ్లు ఉన్నాయ‌న్న విష‌యాన్ని కెన‌డా ప్ర‌జ‌లు గుర్తించాల‌న్నారు. న‌ల్ల‌జాతీయ కెన‌డీయులు, జాత్యాంహ‌కారానికి గురైన కెన‌డీయులు ప్ర‌తి రోజు ఏదోర‌కంగా వివ‌క్ష‌కు గుర‌వుతున్నార‌ని తెలిపారు. దేశంలో వ్య‌వ‌స్థీకృత వివ‌క్ష ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కెన‌డాలోనూ వివ‌క్ష ఉన్న విష‌యం వాస్త‌వ‌మే అని ట్రూడో తెలిపారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close