సినిమా

అభిమానుల‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ విన్నపం!

  • క‌రోనా నుంచి కోలుకుంటున్నాను
  • ప్ర‌తి ఏడాది నా పుట్టిన‌రోజున అనేక‌ కార్య‌క్ర‌మాలు చేస్తారు
  • ఈ సారి మాత్రం చేయొద్దు
  • ఇంటి ప‌ట్టునే ఉంటూ లాక్‌డౌన్ నియ‌మాల‌ను పాటించాలి

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావ‌డంతో కొన్ని రోజులుగా ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు సందేశాలు పంపుతున్నారు. ప‌లు ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్ర‌త్యేక పూజలు చేస్తున్నారు. దీంతో త‌న ప‌ట్ల ప్రేమ కురిపిస్తోన్న అభిమానుల‌కు ఎన్టీఆర్ ఓ విన్న‌పం చేశారు.

కొన్ని రోజులుగా అభిమానులు పంపుతోన్న సందేశాలు, వీడియోలను చూస్తున్నాన‌ని, వారి ఆశిస్సులు త‌న‌కెంతో ఊర‌ట క‌లిగించాయ‌ని, ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగ‌ల‌న‌ని ఎన్టీఆర్ అన్నారు. ప్ర‌స్తుతం తాను బాగానే ఉన్నాన‌ని, కరోనాను జ‌యిస్తాన‌ని ఆశిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌తి ఏడాది త‌న పుట్టిన‌రోజున అభిమానులు చూపే ప్రేమ‌, చేసే కార్య‌క్ర‌మాలు ఒక ఆశీర్వ‌చ‌నంగా భావిస్తాన‌ని, కానీ, ఈ ఏడాది మాత్రం ఇంటి ప‌ట్టునే ఉంటూ లాక్‌డౌన్ నియ‌మాల‌ను పాటించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close