తెలంగాణ

జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్‌

  • సేఫ్టీ సర్టిఫికెట్‌ అందజేసిన సీఎమ్మార్‌ఎస్‌
  • ప్రారంభ తేదీని ఖరారుచేయనున్న ప్రభుత్వం

 హైదరాబాద్‌ మెట్రోరైలు కారిడార్‌2కు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మధ్య 11 కి.మీ. మెట్రోరైలు ఇక ప్రయాణికులతో పరుగులు పెట్టనున్నది. మూడ్రోజులుగా తనిఖీలు నిర్వహించిన కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైలు సేఫ్టీ (సీఎమ్మార్‌ఎస్‌) జేకే గార్గ్‌.. కమర్షియల్‌ ఆపరేషన్స్‌ (ప్రయాణికుల రాకపోకల)కు అనుమతిస్తూ ఆదివారం మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డికి సేఫ్టీ సర్టిఫికెట్‌ అందజేశారు. ఈ మార్గం ప్రయాణికులకు అందుబాటులో వచ్చే తేదీని ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. 25 కేవీ ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రికల్‌ ట్రాక్షన్‌తోపాటు ఇతర ఎలక్ట్రికల్‌ పరికరాలను, ఈ మార్గంలోని స్టేషన్లలో ఫైర్‌సేఫ్టీ, సిగ్నలింగ్‌ అండ్‌ టైంకంట్రోల్‌ విధానంతోపాటు మిగతా అన్నిఅంశాలను ఆయా విభాగాల నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. వయాడక్ట్‌, ట్రాక్‌, సిగ్నలింగ్‌, టెలికాం, స్టేషన్‌ నిర్మాణం, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, టికెటింగ్‌ సిస్టం, కంట్రోల్‌రూం, ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు తదితరాలన్నింటినీ తనిఖీచేసిన సీఎమ్మార్‌ఎస్‌ బృందం సంతృప్తి వ్యక్తంచేసింది.

METRO-1

ట్రయల్న్‌ జరుగుతున్న సమయంలో ప్రతి అంశాన్ని పరిశీలించి కారిడార్‌2కు క్లియరెన్స్‌ ఇచ్చింది. 11 కి.మీ.కు సంబంధించి జేబీఎస్‌, పరేడ్‌గ్రౌండ్స్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ హాస్పిటల్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ స్టేషన్లుంటాయి. తనిఖీల్లో ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీరెడ్డి, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఏకే సైనీ, ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎంపీ నాయుడు, లూయిస్‌ బర్గర్‌, టీంలీడర్‌ కృష్ణస్వామి, హైదరాబాద్‌ మెట్రోరైలు సీపీఎం ఆనంద్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. కారిడార్‌ 2 అందుబాటులోకి రానుండటంతో మొదటిదశ మెట్రోరైలు ప్రాజెక్టు దాదాపు పూర్తయినట్టే. ముందుగా ప్రకటించినట్టు 67 కి.మీ. మెట్రోరైలు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే కారిడార్‌ 1, 3కు సంబంధించి ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు, నాగోల్‌ నుంచి రాయదుర్గ్‌ వరకు ప్రయాణికుల కోసం మెట్రోరైలు రాకపోకలు సాగిస్తున్నది.

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close