అంతర్జాతీయంటాప్ స్టోరీస్

న్యూజిలాండ్ సూప‌ర్‌మార్కెట్‌లో ఉగ్ర‌దాడి.. క‌త్తితో ఆరుగుర్ని పొడిచిన ఐసిస్ ఉన్మాది

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉన్న ఓ సూప‌ర్‌మార్కెట్‌లో ఇవాళ ఉగ్ర‌దాడి జ‌రిగిన‌ట్లు ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఆరుగురిన్ని క‌త్తితో పొడిచిన ఆ ఉన్మాదిని పోలీసులు మ‌ట్టుబెట్టిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. శ్రీలంకకు చెందిన‌ ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్ర‌వాది ఈ దాడికి పాల్పడిన‌ట్లు ఆమె చెప్పారు. క‌త్తిదాడి జ‌రిగిన 60 సెక‌న్ల లోపే ఆ ఉన్మాదిని హ‌త‌మార్చిన‌ట్లు ప్ర‌ధాని జెసిండా తెలిపారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి 2011లో న్యూజిలాండ్‌కు వ‌చ్చాడ‌ని, 2016 నుంచి అత‌నిపై జాతీయ భ‌ద్ర‌తా ద‌ళం నిఘా పెట్టిన‌ట్లు ఆమె చెప్పారు. ఆ ఉన్మాది భావ‌జాలం విప‌రీతంగా ఉన్న నేప‌థ్యంలో అత‌నిపై నిఘా పెట్టిన‌ట్లు జెసిండా తెలిపారు.

ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉన్మాది సూప‌ర్‌మార్కెట్‌లో క‌త్తితో బీభ‌త్సం సృష్టించిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ప్ర‌జ‌లు ఆ మార్కెట్ నుంచి అటూ ఇటూ ప‌రుగులు తీశార‌న్నారు. అరుపులు, కేక‌లు పెట్టార‌న్నారు. ఓ వ్య‌క్తి క‌త్తిపోట్ల‌తో కింద‌ప‌డిపోయిన‌ట్లు ఒక‌రు తెలిపారు. న్యూ లిన్ ప్రాంతంలో ఉన్న లిన్‌మాల్ నుంచి జ‌నం భ‌యంతో ప‌రుగులు తీస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యాయి. ఆరుగుర్ని హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్ల‌గా, దాంట్లో ముగ్గురు క్రిటిక‌ల్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఐసిస్ సిద్ధాంతాల‌ను ప్రోత్స‌హిస్తున్న ఆ ఉన్మాదికి ఇటీవ‌ల 12 నెల‌ల శిక్ష ప‌డింది. అభ్యంత‌ర‌క‌ర వ‌స్తువుల‌ను క‌లిగి ఉన్న కేసులో ఆ శిక్ష‌ను విధించారు. కేవ‌లం ముస్లింను కావ‌డం వ‌ల్లే త‌న‌ను వేధిస్తున్న‌ట్లు ఆ వ్య‌క్తి కోర్టుకు తెలిపారు. అయితే ఆ వ్య‌క్తి ఇంట‌ర్నెట్ సెర్చ్‌ను పోలీసులు ప‌రిశీలించారు. దాంట్లో ఎక్కువ‌గా ఇస్లామిక్ స్టేట్ గురించి అత‌ను సెర్చ్ చేసిన‌ట్లు తెలిసింది. వాళ్లు ధ‌రించే ద‌స్తులు, జెండాలు, వాడే ఆయుధాలు, ఇస్లామిక్ హీరోలు ఎవ‌ర‌ని సెర్చ్ చేసిన‌ట్లు కూడా తెలిసింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close