సినిమా

‘జాను’ టీజర్..

శర్వానంద్‌, స‌మంత అక్కినేని హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం ‘జాను’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన ‘96’ చిత్రానికి ఇది రీమేక్‌. త‌మిళంలోనూ ప్రేమ్‌కుమారే డైరెక్ట్ చేశాడు. రీసెంట్‌గా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్, టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 9న సాయంత్రం 5 గంట‌ల‌కు విడుదల చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సమంత, శర్వానంద్ లుక్స్ కానీ.. వాళ్ల చిన్ననాటి పాత్ర పోషించిన నటీనటుల లుక్స్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అటు సంతోషం, ఇటు దుఖాన్ని టీజర్‌లో సమపాళ్లలో చూపించారు. ఈ టీజర్ చూసిన అభిమానులు తమిళ సినిమాలో ఉన్న ఫ్లేవర్‌ని ఏ మాత్రం పోగొట్టకుండా సినిమాని తెరకెక్కించారని అంటున్నారు. ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళంలో సంగీతం అందించిన గోవింద్ వసంత తెలుగులోనూ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 7న సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని సినీ వ‌ర్గాల్లో గుసగుసలు విన‌ప‌డుతున్నాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close