టాప్ స్టోరీస్తెలంగాణ

తెలంగాణలో ఇంటింటా ఇంటర్నెట్

తెలంగాణలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటితో పాటు ఇంటర్నెట్ సౌకర్యం రానుందని ఆర్‌డబ్ల్యూఎస్  ఈఎన్‌సీ సురేందర్ రెడ్డి తెలిపారు. తాగు నీటి సరఫరా పనులతో పాటు ఇంటర్నెట్ డక్ట్‌ను కూడా వేయాలని అధికారులను ఆదేశించారు.

ఆయన తన కార్యాలయం నుంచి జిల్లాల ఎన్‌సీలు, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి పైపులైన్లను మరమ్మతులు చేసేటప్పుడు ఫైబర్‌ డక్ట్‌కు నష్టం కలగకుండా ఉండేందుకు ఇండికేటర్లు అమర్చాలన్నారు. వర్షాలు ప్రారంభమైనందున గ్రామాల అంతర్గత పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలోకి నీరు చేరుతోందని, నిరంతర నీటి సరఫరాకు ఎక్కడికక్కడ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

అంతర్గత పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, ఇంటింటికీ నల్లా నీళ్లు అందించాలన్నారు. సీఎం కేసీఆర్‌ వద్ద జరిగిన సమావేశంలో వర్క్‌ ఏజెన్సీలు ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎలక్ట్రో మెకానికల్‌ ఓ అండ్‌ ఎంపై హెడ్‌ వర్క్స్‌ల్లో నిర్వహించే శిక్షణా తరగతులకు హాజరు కావాలని సూచించారు. నీటి పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close