స్పెషల్

నష్టాల్లో మార్కెట్లు

-సెన్సెక్స్‌ 52, నిఫ్టీ 28 పాయింట్లు క్షీణత
ముంబై, జనవరి 8:స్టాక్‌ మార్కెట్ల దోబుచులాట కొనసాగుతున్నది. మంగళవారం భారీగా లాభపడిన సూచీలు ఆ మరుసటి రోజే తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా భద్రతదళాలపై ఇరాన్‌ దాడులు చేయడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా పతనమైన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు 51.73 పాయింట్లు పతనం చెంది 40,817.74 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 27.60 పాయింట్లు అందుకొని 12,025.35 వద్ద నిలిచింది. ఇరాన్‌ ప్రతీకార దాడులతోపాటు దేశ ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నట్లు వస్తున్న సంకేతాలు మార్కెట్ల పతనాన్ని శాసించాయి. దేశ జీడీపీ 11 ఏండ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి పడిపోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నివేదికను విడుదల చేయడం మదుపరుల్లో ఆందోళనను పెంచింది. బుధవారం నాటి మార్కెట్లో ఎల్‌ అండ్‌ టీ అత్యధికంగా రెండు శాతానికి పైగా పతనం చెంది టాప్‌ లూజర్స్‌గా నిలిచింది. వీటితోపాటు ఓఎన్‌జీసీ, టైటాన్‌, సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రాలు ఒక్కశాతంకుపైగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి.
అలాగే కొటక్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌, మారుతి, ఐటీసీ, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌లు మార్కెట్‌ వాటాను కోల్పోయాయి. కానీ, భారతీ ఎయిర్‌ టెల్‌ 3 శాతానికి పైగా లాభపడి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఎస్బీఐ, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌లు తమ మార్కెట్‌ వాటాను పెంచుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రీక్తత పరిస్థితుల దీర్ఘకాలికంగా స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై మదుపరులు దృష్టి సారించే అవకాశాలున్నాయన్నారు. రంగాలవారీగా చూస్తే క్యాపిటల్‌ గూడ్స్‌, ఇంధనం, ఇండస్ట్రీయల్‌, చమురు అండ్‌ గ్యాస్‌, మెటల్‌, వాహన రంగ షేర్లు 1.42 శాతం వరకు పతనమవగా..టెలికం, టెక్‌, ఐటీ రంగ షేర్లు మూడు శాతం వరకు బలపడ్డాయి.

కోలుకున్న రూపాయి

ఫారెక్స్‌ మార్కెట్‌ ప్రారంభంలో భారీగా నష్టపోయిన దేశీయ కరెన్సీ విలువ చివరకు లాభాల్లోకి వచ్చింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు ఎగబాకి 71.70 వద్ద ముగిసింది. 72.05 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ 71.82 వద్ద ట్రేడింగ్‌ జరిగింది. ఇతర ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ మరింత బలోపేతం అయింది. వరుసగా మూడు నెలలుగా భారీగా నిధులను కుమ్మరిస్తున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.515.85 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close