జాతీయంటాప్ స్టోరీస్టెక్నాలజీబ్రేకింగ్ న్యూస్

వాట్సప్‌ సీఈవోకు కేంద్రం వార్నింగ్‌

వాట్సప్‌ లో ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్‌లతో దాడులు పెరిగిపోతుండడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తక్షణం భారతదేశంలో స్థానిక సంస్థను ఏర్పాటు చేసి, దేశీయ చట్టాలకు లోబడి పనిచేయాలని ఆదేశించింది.

వాట్సప్‌ సీఈవో క్రిస్‌ డేనియెల్స్‌తో సమావేశమైన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, వాట్సప్‌ వల్ల జరుగుతున్న అనర్థాలపై చర్చించారు. దేశంలో డిజిటల్ విప్లవంలో, సమాచార మార్పిడిలో వాట్సప్‌ పోషించిన పాత్రను అభినందించిన రవిశంకర్‌ ప్రసాద్‌, ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలనూ క్రిస్‌తో ప్రస్తావించారు. మాకుమ్మడి దాడులకు కారణమవుతున్న మెసేజ్‌లను అరికట్టే విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close