అంతర్జాతీయంటాప్ స్టోరీస్రాజకీయంస్పెషల్

స్విస్‌ బ్యాంకుల్లో 50 శాతం పెరిగిన భారతీయుల డిపాజిట్లు

స్విస్‌ బ్యాంకులంటే నల్లధనం దాచుకోవడానికి సురక్షితం అన్న అభిప్రాయం చాలామందింది. అందుకే, ప్రపంచంలోని కుబేరులంతా అక్కడ వేల కోట్ల రూపాయలను డిపాజిట్లు చేస్తుంటారు. అయితే.. ఇలా పోగుపడ్డ సొమ్ములో భారతీయుల వాటా కూడా ఎక్కువే అన్నది చాలా మంది అభిప్రాయం. గత ఎన్నికల్లో ఇదే ప్రధానాంశమయ్యింది. తమను గెలిపిస్తే స్విస్‌ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తానంటూ ప్రచారం చేసి జనం మనస్సులను గెలుచుకున్నారు నరేంద్రమోడీ. నల్లధనం వెనక్కి వస్తుందన్న ఆశతో కోట్లాది మంది బీజేపీకి ఓట్లు గుద్దారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి, మోడీ ప్రధాని అయ్యి ఇప్పటికే నాలుగేళ్లు పూర్తైపోయాయి. మరి నల్లధనం ఏమయ్యింది? ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేశాక, నల్లధనం వెలికి తీతకు ఓ ప్రత్యేక కమిషన్ వేశారు.. కానీ, ఇంతవరకూ విదేశాల్లో పోగుపడ్డ బ్లాక్‌మనీలో ఒక్క రూపాయి కూడా భారత్‌కు తిరిగి రాలేదు. పైగా, స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు ఏకంగా 50 శాతం పెరిగిపోయాయట. ఇప్పుడు భారతీయుల డబ్బు స్విస్ బ్యాంక్‌లో 1.01 బిలియన్ల స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకుంది. అంటే మన కరెన్సీలో  అక్షరాలా 7000 కోట్ల రూపాయిలన్నమాట.

2017 నాటికి స్విస్ బ్యాంక్‌లో అన్ని విదేశీ క్లయింట్ల డిపాజిట్లు నిధులు 3 శాతం.. అంటే 1,46 ట్రిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్లు (100 లక్షల కోట్లు రూపాయిలు) పెరిగాయని స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్‌ పేర్కొంది.

ఎస్‌ఎన్బీ డేటా ప్రకారం ..2017 నాటికి స్విస్  బ్యాంక్‌లో భారతీయుల డబ్బు మొత్తం 6,891 కోట్ల రూపాయలు పెరిగిందని, కస్టమర్‌ డిపాజిట్ల రూపంలో 3,200 కోట్లు, ఇతర బ్యాంకుల ద్వారా 1,050 కోట్లు, సెక్యూరిటీ వంటి ఇతర మార్గాల ద్వారా 2,640 కోట్లు స్విస్ బ్యాంక్‌ వచ్చినట్లు తెలిపింది.

2006 చివరినాటికి స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము రికార్డు స్థాయిలో 23వేల కోట్లకుచేరుకుంది. కాని ఆ తర్వాత అకస్మాత్తుగా పడిపోయాయి. మళ్లీ 2011 నుంచి స్విస్‌ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగసాగాయి. 2011లో 12 శాతం, 2013లో 43 శాతం మరియు 2017లో ఏకంగా 50.2 శాతం పెరిగింది. స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లలో  పెరుగుదల నమోదు కావడం ఇది మూడోసారి. 2004లో 56 శాతం పెరిగింది.

స్విస్‌ బ్యాంకుల్లో బ్లాక్‌మనీ దాచుకున్న వారి వివరాలు ఇవ్వాలంటూ భారత్‌ ప్రభుత్వం స్విస్ బ్యాంక్ అధికారుతో   అనేక మార్లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. నల్లధనాన్ని నిర్మూలిస్తానన్న మోడీ హయాంలో ఇలా స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరగడం, కమలనాథులకు కంట్లో నలుసుగా మారింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close