జాతీయంటాప్ స్టోరీస్

దేశంలో కొత్తగా 12 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,59,873 మంది మరణించగా, 3,37,24,959 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

కాగా, 2020, మార్చి తర్వాత యాక్టివ్‌ కేసుల రేటు కనిష్టానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 0.43 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 221 మంది మరణించగా, 12,165 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,70,46,116 కరోనా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close