జాతీయంటాప్ స్టోరీస్

కరోనా డేంజర్‌ బెల్స్‌.. 24గంటల్లో 1.15లక్షల కేసులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,17,92,135 మంది కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో ఇప్పటి వరకు 1,66,177 మృతి చెందారు.

ప్రస్తుతం దేశంలో 8,43,473 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 8,70,77,474 డోసులు వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 12,08,329 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ చెప్పింది. ఇప్పటి వరకు 25.14కోట్ల నమూనాలను టెస్ట్‌ చేసినట్లు వివరించింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close