జాతీయంటాప్ స్టోరీస్

దేశంలో ఒకేరోజు 55 వేల‌కుపైగా క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. దీంతో దేశంలో క‌రోనా కేసులు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 52,123 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అంత‌కు మించి కేసులు రికార్డ‌య్యాయి. దీంతో క‌రోనా కేసులు 16 ల‌క్ష‌లు దాటాయి. 

గ‌త 24 గంట‌ల్లో దేశంలో 55,079 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 779 మంది మృతిచెందారు. దీంతో క‌రోనా కేసుల సంఖ్య 16,38,871కు చేరింది. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 35,747 మంది మ‌ర‌ణించారు. మొత్తం న‌మోదైన క‌రోనా కేసుల్లో 5,45,318 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 10,57,806 మంది బాధితులు కోలుకున్నారు. 

దేశవ్యాప్తంగా జూలై 30 వ‌ర‌కు 1,88,32,970 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. గురువారం ఒక్క‌రోజే 6,42,588 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని తెలిపింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు ఒకేరోజు ఇంత మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసార‌ని వెల్ల‌డించింది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close