టాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్సినిమా

నెటిజన్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే రిఫ్లై ఇచ్చిన ఇలియానా

నటి ఇలియానా తరుచూ ఏదో ఒక పోస్టుతో సోషల్‌ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. విదేశీ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్న ఇలియానా చాలారోజుల కింద హబ్బీ అని పోస్ట్‌ చేసి.. ఇటీవల పోస్ట్‌ లో మాత్రం మైలవ్‌ అని సంబోధించారు. తాజాగా ప్రియుడు నీబోన్‌తో డేటింగ్‌, పెళ్లి లాంటి విషయాలపై ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఇలియానా చక్కటి బదులిచ్చారు. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఓ విదేశీయుడితో మీరు ఎందుకు డేటింగ్‌ చేస్తున్నారు.. అతడిని మీ జీవిత భాగస్వామిగా ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తూ పోస్ట్‌ చేశారు. ‘ ఓ వ్యక్తి మనసుతో నా మనసు ప్రేమలో పడింది. అతడి శరీర రంగు, జాతీయత లాంటి విషయాలు నాకు అనవసరం’ అంటూ ఇలియానా బదులిచ్చింది. ప్రేమ, పెళ్లి గురించి తనను అడిగిన ప్రశ్నకు నటి దిమ్మతిరిగే రిఫ్లై ఇచ్చారంటూ ఇలియానా ఫోయాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు ఆండ్రూ నీబోన్‌తో వివాహం జరిగిందా అన్న ప్రశ్నకు మాత్రం ఎప్పటికప్పుడు చాలా అందంగా సమాధానం దాటవేస్తున్నారు. రీల్‌ లైఫ్‌తో పాటు రియల్‌ లైఫ్‌ చాలా బాగుందని మాత్రం సెలవిస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close