బిజినెస్

ICICI scheme: ఐసీఐసీఐ ప్రారంభించిన ఈ స్కీమ్‌తో ఎక్కువ లాభం

బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేయాలనుకునేవారి కోసం ఐసీఐసీఐ బ్యాంక్ కొత్తగా ఓ స్కీమ్ ప్రారంభించింది. ‘ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ’ పేరుతో సీనియర్ సిటిజన్ల కోసం ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వృద్ధుల కోసం ‘ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్’ స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ కూడా వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి వార్షికంగా 6.55% వడ్డీ అందించనుంది ఎస్‌బీఐ. గతంలో వృద్ధులకు ఆఫర్ చేసిన వడ్డీ కన్నా ఇది 30 బేసిస్ పాయింట్స్ ఎక్కువ. సాధారణ ప్రజలతో పోలిస్తే 80 బేసిస్ పాయింట్స్ ఎక్కువ.

‘ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ’ స్కీమ్ మే 20న ప్రారంభమైంది. సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఇందు‌లో 5 నుంచి 10 ఏళ్లకు రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు. పాత ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యువల్ చేసేవాళ్లు కూడా ఈ స్కీమ్‌లోకి మారొచ్చు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 90% వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తుంది బ్యాంకు. ఆసక్తి గల కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ‘ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ’ స్కీమ్‌లో చేరొచ్చు. లేదా ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో మరిన్ని వివరాలకు సంప్రదించొచ్చు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close