జాతీయంటాప్ స్టోరీస్

ఐఏఎఫ్ రూపాంత‌రం చెందుతోంది -భ‌దౌరియా

ఎయిర్ ఫోర్స్ డే సంబ‌రాలు ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఘ‌జియాబాద్‌లోని హింద‌న్ ఎయిర్‌బేస్‌లో జ‌రిగిన వేడుక‌ల్లో ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ భ‌దౌరియా పాల్గొన్నారు.  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుంద్‌, నేవీ చీఫ్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్‌లు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. హింద‌న్ ఎయిర్‌బేస్‌లో జ‌రిగిన ఎయిర్ ఫోర్స్ డే ప‌రేడ్‌ను భ‌దౌరియా వీక్షించారు. ఆ త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ.. భార‌త వైమానిక ద‌ళంలో 89వ సంవ‌త్స‌రంలోకి ఎంట‌ర్ అయ్యింద‌న్నారు. ఐఏఎఫ్ క్ర‌మంగా రూపాంత‌రం చెందుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  ఇప్పుడు మ‌నం ఓ కొత్త శ‌కంలోకి ప్ర‌వేశించామ‌న్నారు. మ‌న వైమానిక ‌శ‌క్తిని, మ‌ల్టీ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించే కాలంలో ఉన్న‌ట్లు తెలిపారు. ఈ ఏడాది చాలా అసాధార‌ణ రీతిలో గ‌డుస్తున్న‌ద‌ని,  కోవిడ్ ప్ర‌పంచం అంతా వ్యాపిస్తుంటే, మ‌న దేశం స్థిరంగా స్పందించింద‌ని, ఇలాంటి స‌మ‌యంలో వైమానిక ద‌ళ‌ల యోధులు త‌మ సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించినట్లు ఆయన చెప్పారు. 

భార‌త వైమానిక ద‌ళం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని,  దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని, ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు ఎల్ల‌ప్పుడూ సంసిద్దంగా ఉంటుంద‌ని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ తెలిపారు.  ఇటీవ‌ల ఉత్త‌ర స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో వైమానిక ద‌ళాలు స్పందించిన తీరు అద్భుత‌మ‌ని, వారిని అభినందించిన‌ట్లు కూడా ఆయ‌న గుర్తు చేశారు.  చాలా త‌క్క‌వ స‌మ‌యంలోనే మ‌న యుద్ధ సామాగ్రిని ఆ ప్రాంతంలో మోహ‌రించామ‌ని, భార‌తీయ ఆర్మీకి కూడా కావాల్సిన తోడ్పాటు అందిచామ‌ని భ‌దౌరియా తెలిపారు. 

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close