తెలంగాణ

హైద‌రాబాద్‌లో 24 శాతం అధిక వ‌ర్ష‌పాతం న‌మోదు

హైద‌రాబాద్ : భారీ వ‌ర్షాలు భాగ్య‌న‌గ‌రాన్ని ముంచెత్తాయి. నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో హైద‌రాబాద్ వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురిశాయి. ఈ మూడు నెల‌ల కాలంలో హైద‌రాబాద్‌లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే 24 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. జూన్ 1 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు 24 శాతం అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మారేడుప‌ల్లిలో అత్య‌ధికంగా 46 శాతం అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

మారేడుప‌ల్లిలోనే అత్య‌ధికంగా 745.6 మి.మీ. వ‌ర్ష‌పాతం ( సాధార‌ణ వ‌ర్ష‌పాతం – 509.4 మి.మీ.) న‌మోదైంది. ముషీరాబాద్‌, అమీర్‌పేట‌, షేక్‌పేట‌, ఆసిఫ్‌న‌గ‌ర్‌, తిరుమ‌ల‌గిరి ఏరియాల్లో 30 నుంచి 40 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

సైదాబాద్‌లో 654.4 మి.మీ. ( సాధార‌ణ వ‌ర్ష‌పాతం – 463.1 మి.మీ.), ఆసిఫ్‌న‌గ‌ర్‌లో 621 మి.మీ. ( సాధార‌ణ వ‌ర్ష‌పాతం – 463.1 మి.మీ.), అమీర్‌పేట‌లో 677.1 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం – 509.1 మి.మీ.), తిరుమ‌ల‌గిరిలో 677.6 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం – 509.1 మి.మీ.), షేక్‌పేటలో 609.8 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం – 463.1 మి.మీ.), ముషీరాబాద్‌లో 666.1 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం – 510.3 మి.మీ.) వ‌ర్ష‌పాతం న‌మోదైంది. రాబోయే రెండు రోజుల్లో హైద‌రాబాద్‌లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close