క్రైమ్

పాక్ చేతిలో భార‌త్ ఓడింద‌ని పండుగ చేసుకున్న భార్య‌.. ఆమెపై కేసు పెట్టిన భ‌ర్త‌

  • ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో ఘ‌ట‌న
  • కుటుంబ సభ్యులతో క‌లిసి బాణసంచా కాల్చిన భార్య‌
  • వాట్సప్ స్టేటస్‌లోనూ పెట్టుకున్న వైనం
  • ఆమె తీరుపై భ‌ర్త ఆగ్ర‌హం  

పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు చేతిలో భారత జ‌ట్టు ఓటమి చెందిందంటూ సంబ‌రాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవ‌ల ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో ఓ వ్య‌క్తి త‌న భార్య‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌పై ఫిర్యాదు చేశాడు. పాక్ గెలిచిందంటూ వారు సంబ‌రాలు చేసుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీంతో అత‌డు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు స్థానిక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో షంగన్‌ఖేడాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇషాన్ మియా దేశ భ‌క్తుడు.. టీమిండియా అభిమాని. ఆయ‌న భార్య‌ రబియా షంషీ మాత్రం పాక్‌కు మ‌ద్ద‌తు తెలుపుతోంది.

పాక్ క్రికెట్ జ‌ట్టు చేతిలో టీమిండియా ఓడిన నేప‌థ్యంలో రబియా త‌న‌ కుటుంబ సభ్యులతో క‌లిసి బాణసంచా కాల్చి పండుగ చేసుకుంది. పాక్ గెలిచిందంటూ అంబ‌రాన్నంటే సంతోషం వ్య‌క్తం చేస్తూ వాట్సప్ స్టేటస్‌లోనూ పెట్టుకున్నారు. వారి తీరు ఇషాన్‌కు మంట‌పుట్టించి, పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో కేసు న‌మోదైంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close