అంతర్జాతీయంటాప్ స్టోరీస్

ల‌క్షా 20 వేల ఏళ్ల క్రిత‌మే సౌదీలో మాన‌వ పాద‌ముద్ర‌లు !

ఈ అడుగులు చూస్తున్నారా. సౌదీ అరేబియాలో ఆది మాన‌వుడు మోపిన పాదం ఇదే. సుమారు ల‌క్షా 20 వేల ఏళ్ల క్రితం సౌదీ అరేబియా ఉత్త‌ర ప్రాంతంలో హోమోసేపియ‌న్లు సంచ‌రించిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ భారీ పాద ముద్ర‌ ఆ మాన‌వుల‌కే చెంది ఉంటుంద‌‌ని భావిస్తున్నారు. సౌదీలోని నిఫుడ్ ఎడారిలో ఈ ముద్ర‌ల‌ను గుర్తించారు. ఏనుగులు, ఒంటెలు, క్రూర జంతువుల‌ను వేటాడే పనిలో భాగంగా.. ఈ ప్రాంతాన్ని అప్ప‌టి మాన‌వులు సంచ‌రించి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అరేబియాలో క‌నిపించిన నిజ‌మైన మాన‌వ పాద‌ముద్ర‌లు అని ఆర్కియాల‌జిస్టులు పేర్కొన్నారు. మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్‌టిట్యూట్ ఫ‌ర్ ద సైన్స్ ఆఫ్ హ్యూమ‌న్ హిస్ట‌రీకి సంబంధించిన ఆర్కియాల‌జిస్ట్ మైఖేల్ పెట్ర‌గ్లియా దీన్ని ద్రువీక‌రించారు. ఆఫ్రికా నుంచి బ‌య‌లుదేరిన ఆ ఆది మాన‌వులు… అరేబియా మీదుగా మ‌ధ్య‌ప్రాచ్యం, యురేసియా వెళ్లిన‌ట్లు ప‌రిశోధ‌కులు అంచ‌నాకు వ‌చ్చారు. అరేబియా దీవుల్లో అనేక ప్రాంతాల‌ను ఆది మాన‌వులు సంచ‌రించిన‌ట్లు అక్క‌డ ల‌భ్య‌మైన రాతి ప‌రిక‌రాల ఆధారంగా భావిస్తున్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close