క్రైమ్

ప్లాస్టిక్ బ్యాగుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!

  • తెంపల్లిలోని విజయ పారి మిల్స్ కంపెనీలో ఘటన
  • తెల్లవారుజామున ఐదు గంటలకు చెలరేగిన మంటలు
  • ప్రమాద కారణంపై పోలీసుల ఆరా

కృష్ణా జిల్లాలోని ఓ ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గన్నవరం మండలం తెంపల్లి రైల్వే గేట్ సమీపంలోని విజయ పారి మిల్స్ కంపెనీలో ఈ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు. ఈ ఘటనలో భారీ ఆస్తినష్టం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close