జాతీయంబిజినెస్

ఏఐ చీఫ్‌గా మళ్లీ రాజీవ్‌ బన్సల్‌

సీనియర్‌ బ్యూరోక్రాట్‌ రాజీవ్‌ బన్సల్‌ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా (ఏఐ) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మళ్లీ నియమితులయ్యారు.

 సీనియర్‌ బ్యూరోక్రాట్‌ రాజీవ్‌ బన్సల్‌ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా (ఏఐ) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మళ్లీ నియమితులయ్యారు. 2017లో మూడు నెలలపాటు కంపెనీ చీఫ్‌గా వ్యవహరించిన నాగలాండ్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన బన్సల్‌ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. వ్యక్తిగత మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆయన పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకు అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆఫ్‌ ది క్యాబినెట్‌ అనుమతినిచ్చింది కూడా. అశ్వని లోహానీ పదవి విరమణ చేసిననాటి నుంచి ఈ పదవిలో ఎవర్ని నియమించలేదు కేంద్ర ప్రభుత్వం. రూ.60 వేల కోట్లకు పైగా అప్పులతో సతమతమవుతున్న ఎయిర్‌ ఇండియాను ఈ ఆర్థిక కష్టాలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. 


ఆర్థిక కార్యదర్శిగా దేబాశిశ్‌ పాండా

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దేబాశిశ్‌ పాండాను నూతన ఆర్థిక సేవల కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1987 ఐఏఎస్‌ క్యాడర్‌కు చెందిన పాండాను ప్రస్తుతం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రాజీవ్‌ కుమార్‌ స్థానంలో నియమితులయ్యారు. అలాగే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్‌ కుమార్‌ అగర్వాల్‌ను వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శికి బదిలీ చేసింది.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close