స్పెషల్

హోలీ.. ఈసారికి ఇలా!

హోలీ పండుగ హుషారు ఈ సారి అంతగా కనిపించడం లేదు. కరోనా వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే భయమే దానికి కారణం. ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి  అమిత్‌షా సహా కొంత మంది సెలబ్రెటీలు ఈ ఏడాది హోలీ వేడుకలకు దూరం అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హోలీ జరుపుకోవడంలో ఎలాంటి  

జాగ్రత్తలు తీసుకోవాలంటే… 

సాధారణంగా జనాలు పెద్ద సంఖ్యలో గుంపులుగా కూడా హోలీ జరుపుకుంటారు. జనం ఎక్కువగా గుమికూడే చోట కరోనా వైరస్‌ త్వరగా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి కుటుంబంతో కలసి ఒక ప్రదేశంలో సంబరాలు చేసుకోవడమే మంచిది.

రంగులు పట్టుకొని ఇదివరకటిలా ఇంటిటికీ తిరగడం వల్ల ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ ఏడాది స్నేహితులకు సారీ చెప్పి ఇంటిపట్టునే ఉండడం అన్నివిధాలా మేలు.

జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనారోగ్య లక్షణాలతో ఉన్న వ్యక్తులతో కలసి హోలీ ఆడకూడదు. 

రంగుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మ, కంటి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కరోనా వైరస్‌ భయాలు ఉన్న నేపథ్యంలో డాక్టర్‌ సలహాలు తీసుకోవాలి. 

చల్లని వాతావరణంలో ఈ వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి చన్నీళ్లతో హోలీ ఆడడం మంచిది కాదు. 

 వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అనారోగ్యంతో ఉన్న వారికి దూరంగా ఉండడం ద్వారా సురక్షితంగా రంగుల పండుగను ఆస్వాదించవచ్చు.  

రంగునీళ్లను చల్లడానికి కొత్త వాటర్‌ గన్‌లకు బదులు పాతవి ఇంట్లో ఉంటే వాటిని ఉపయోగించడం మంచిది.    వీటిని వాడడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం  తగ్గుతుంది.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close