జాతీయం

రజనీకాంత్ పై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

  • ఇటీవల పెరియార్ పై రజనీ వ్యాఖ్యలు
  • రజనీ వ్యాఖ్యలపై ద్రవిడర్ విడుదలై కళగం ఆగ్రహం
  • రజనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ పిటిషన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై దాఖలైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ద్రవిడ ఉద్యమనేత తందై పెరియార్ పై రజనీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ ద్రవిడర్ విడుదలై కళగం (డీవీకే) సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తమిళ ప్రజల మధ్య అలజడి రేకెత్తించేలా రజనీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా పోలీసులను ఆదేశించాలని డీవీకే పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఈ విషయంలో మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు ఎందుకొచ్చారంటూ పిటిషనర్ కు అక్షింతలు వేసింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close